మహబుబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణకొత్తపల్లి గ్రామ మామిడి తోట వద్ద ఆకేరువాగు లో శుక్రవారం ఎటువంటి పర్మిషన్ లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న 11 ఇసుక ట్రాక్టర్లను తహసిల్దార్ రాజు ఆదేశాల మేరకు జూనియర్ అసిస్టెంట్ శేఖర్, వీఆర్ఏలు అనిల్, రాజు పక్క సమాచారంతో పట్టుకున్నారు. ట్రాక్టర్ లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.