మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల స్థానిక ఎంపీడీవో కార్యాలయంలోని రైతు వేదికలో శుక్రవారం ఉదయం 10: 30గంటలకు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, కొత్తగూడ ఎన్రోలర్ కన్వీనర్ వజ్జ సారయ్య గురువారం తెలిపారు. మంత్రి సీతక్క, జిల్లా ఉన్నతాధికారులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.