రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకి నిరసనగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ పిలుపు మేరకు రేపు మహబుబాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని మహబూబాబాద్ మాజీ ఎంపీ, భారాస జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రాంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించాలన్నారు.