మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో శుక్రవారం కొమరంభీం కాలనీలో దారం వీరస్వామికి చెందిన పూరిల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వారికి సంబంధించిన నిత్యవసర వస్తువులు కాలిపోయాయన్నారు. ఈ వర్షాకాల పరిస్థితుల్లో ఎక్కడ ఉండాలో అర్థం కావడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నారు.