పర్వతగిరి మండలంలోని సోమవారంలో బుధవారం జరిగిన బస్సు ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వరంగల్ నుంచి అన్నారం షరీఫ్‌కు వెళ్తున్న ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. మాధవి, గురు ప్రసాద్, బాలు అనే ముగ్గురిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.