కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా అందించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. శుక్రవారం మహబుబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రం రైతు వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. కొత్తగూడ, గంగారం మండలాలకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ కాపీలను కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తో కలిసి మంత్రి పంపిణీ చేశారు. ఎక్కువ మందికి ఇళ్లు మంజూరయ్యే విధంగా చూస్తానన్నారు.