మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో గత ఏడు నెలల క్రితం బ్యాంకు ఎటిఎంలో చోరీ జరిగి 29 లక్షల రూపాయలు అపహరించారు. చోరీ చేసిన నలుగురు వ్యక్తులలో ఒక వ్యక్తి ఎ1 రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అబ్దుల్ గనిని కస్టడీకి తీసుకొని బుధవారం సీన్ రికన్స్ట్రక్షన్ కోసం పోలీసులు తీసుకువచ్చారు. మహబూబాబాద్ డిఎస్పి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఏటీఎం సీన్ రికస్ట్రక్షన్ చేశారు.