తొర్రూరు ఆర్టీసీ డిపోలో అత్యధిక కేఎంపిఎల్ తెచ్చిన డ్రైవర్లకు ప్రోత్సాహక చెక్కులను ఆర్టీసీ డిపో మేనేజర్ పద్మావతి శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ పద్మావతి మాట్లాడుతూ డ్రైవర్ రాంచంద్ అత్యధిక కేఎంపిఎల్ తెచ్చి మొదటి స్థానం, డ్రైవర్ నరసయ్య రెండవ స్థానంలో నిలిచారని తెలిపారు. డిపో అభివృద్ధికి ప్రతి డ్రైవర్ కృషి చేయాలని కోరారు.