ఏటూరునాగారంలో వైభవంగా అయ్యప్పస్వామి విగ్రహం ఊరేగింపు

70చూసినవారు
ఏటూరునాగారంలో వైభవంగా అయ్యప్పస్వామి విగ్రహం ఊరేగింపు
ములుగు జిల్లా ఏటూరునాగారంలో అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఆదివారం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఊరేగించారు. పలు వీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో స్వామివారి విగ్రహాలకు భక్తులు ఘనస్వాగతం పలికి, బిందెలతో నీళ్లు ఆరబోసి, మంగళ హారతులు పట్టి నృత్యాలు చేశారు. దీంతో గ్రామంలో సందడి నెలకొంది. అయ్యప్ప భక్తులు, మహిళలు కోలాటం ఆడుతూ పాటలకు నృత్యం చేశారు. అయ్యప్ప నామస్మరణతో వీధులన్నీ మార్మోగాయి.

సంబంధిత పోస్ట్