ములుగు జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం..!

50చూసినవారు
ములుగు జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం..!
ములుగు జిల్లా తాడ్వాయి, ఏటూరు నాగారం సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం ఏటూరునాగారం, పస్రా అటవీశాఖ రేంజ్ అధికారులు హెచ్చరించారు. ఏటూరు నాగారం వన్యప్రాణి డివిజన్ పరిధిలోని అడవిలో పులి సంచరిస్తున్న సమాచారం మేరకు వాటి అడుగుజాడల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. మేడారం సరిహద్దుల్లో ఓ పశువును పులి చంపిందన్న సమాచారం మేరకు బయ్యక్కపేట, ఐలాపూర్ ప్రాంతాల్లో పులి కదలికలపై ఆరా తీస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్