ట్రాఫిక్ లో చిక్కుకున్న అంబులెన్స్

83చూసినవారు
ములుగు జిల్లా చిన్నబోయినపల్లి వద్ద బొలెరో వాహనం ఆదివారం చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉన్న కొంతమందిని వరంగల్ రెఫర్ చేశారు. ఈ క్రమంలో అంబులెన్స్ లో క్షతగాత్రులను తరలిస్తుండగా ఇసుక లారీల కారణంగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. అంబులెన్స్ అర్ధ గంట ట్రాఫిక్ లో చిక్కుకుంది.

సంబంధిత పోస్ట్