బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా బలరాం

64చూసినవారు
బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా బలరాం
బీజేపీ ములుగు జిల్లా అధ్యక్షుడిగా సిరికొండ బలరాంను నియమిస్తూ మంగళవారం పార్టీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. బీజేపీ అధిష్టానం జిల్లా అధ్యక్షుడిగా బలరాంను రెండవసారి నియమించింది. బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు భూక్య జవహర్ లాల్ ను నియమించింది. ఎస్టీ నియోజకవర్గమైన ములుగుకు బీసీ సామాజిక వర్గానికి చెందిన బలరాంను అధ్యక్షుడిగా నియమించడం రెండవ సారి కావడం విశేషం.

సంబంధిత పోస్ట్