ములుగు జిల్లాలోని పాఠశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

57చూసినవారు
ములుగు జిల్లాలోని అన్ని ప్రభుత్వ జడ్పీ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, మహిళా ఉపాధ్యాయులు ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రేపటి నుండి రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం పాఠశాలల్లో ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి డీజే చప్పుళ్లతో విద్యార్థులు ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్