శుభాలను ఇచ్చే సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరమని, ప్రజలందరూ శుభాలతో ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సవాలతో జరుపుకోవాలని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. మంగళవారం నుండి శ్రీ క్రోధి నామ సంవత్సరం సందర్భంగా. సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని అభిలషించారు. అలాగే కొత్త సంవత్సరంలో జిల్లా అన్ని రంగాల్లో మెరుగైన అభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.