ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలంలో సీడీపీఓగా విధులు నిర్వహిస్తున్న ధనలక్ష్మి మంగళవారం ఉదయం కత్తితో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. అంగన్వాడి టీచర్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తుందని కావాలని అంగన్వాడి టీచర్లు తనపై జిల్లా కలెక్టర్ కు తప్పుడు సమాచారం ఇవ్వడంతో అధికారులు తనను సస్పెండ్ చేశారని, దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఆత్మహత్యా ప్రయత్నం చేసుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.