మల్లూరు దేవాలయంలో భక్తుల కిటకిట

74చూసినవారు
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆదివారం కావడంతో సుదూర ప్రాంతాల నుండి లక్ష్మినర్సింహ స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ముందుగా చింతామణి జలపాతం వద్ద పుణ్య స్నానాలు ఆచరించి లక్ష్మినర్సింహాస్వామి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :