ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలైన సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శనం కోసం భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి భక్తులు మేడారం చేరుకుని జంపన్నవాగులో పుణ్యస్నానాలు చేసి సమ్మక్క, సారక్క అమ్మవార్లను దర్శించుకున్నారు. అమ్మవార్లకు భక్తులు ఎత్తు బంగారం, గాజులు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు.