ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు హేమచల లక్ష్మీ నర్సింహస్వామి ఆలయంలో బుధవారం భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ముందుగా చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలను ఆచరించి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, నర్సింహ స్వామి దేవతామూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి, ఆలయ చరిత్ర గురించి భక్తులకు వివరించారు.