శిథిలావస్థకు చేరుకున్న జబ్బోనిగూడెంలో లెవెల్ బ్రిడ్జి

62చూసినవారు
శిథిలావస్థకు చేరుకున్న జబ్బోనిగూడెంలో లెవెల్ బ్రిడ్జి
ములుగు జిల్లా మంగపేట మండలం జబ్బోనిగూడెం గ్రామానికి వెళ్లే దారి మధ్యలో వాగుపై గతంలో నిర్మించిన లో లెవెల్ బ్రిడ్జి శిధిలావస్థకు చేరుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి కూలిపోయే స్థితికి చేరుకుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. జబ్బోనిగూడేనికి వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి కావడం గమనార్హం. భారీ వర్షాలు కురిస్తే బ్రిడ్జి కూలిపోయి, రాకపోకలు నిలిచిపోతాయని స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్