ప్రభుత్వ నిషేధిత పార్టీలకు సహకరించవద్దు: సిఐ

69చూసినవారు
ప్రభుత్వ నిషేధిత పార్టీలకు ఏజెన్సీ ప్రజలు సహకరించవద్దని సిఐ బాబు రావు సూచించారు. ములుగు నియోజక వర్గంలోని కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో గురువారం రాత్రి అవగాహన కల్పించారు. ఇటీవల దామెరతోగులో జరిగిన ఎన్ కౌంటర్లో కొంతమంది నక్సల్స్ గాయపడ్డారని, వైద్యం కోసం తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు. వారు లొంగిపోతే వైద్యం చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు, సివిల్ సిఆర్పీఎఫ్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

సంబంధిత పోస్ట్