విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

60చూసినవారు
విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్యపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి చెందింది. రైతు హాట్కర్ రూప్ సింగ్ వివరాల ప్రకారం. ఎద్దు ఇంటికి రాకపోవడంతో చుట్టు పక్కన పరిసరాల్లో పరిశీలించగా గురువారం విద్యుత్ షాక్ తో ఎద్దు మృతి చెంది కనిపించింది. మృతిచెందిన ఎద్దు విలువ దాదాపు రూ. 50 వేలు ఉంటుంది. విద్యుత్ అధికారులు పరిశీలించి పంచనామా చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు అధికారులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్