అడవి రంగాపూర్ లో విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి

57చూసినవారు
అడవి రంగాపూర్ లో విద్యుత్ షాక్ తో దుక్కిటెద్దు మృతి
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం అడవి రంగపూర్ కు చెందిన రైతు శేషమ్మ దుక్కిటెద్దు విద్యుత్ షాక్ తో మృతి చెందింది. శుక్రవారం మేతకు వెళ్లిన ఎద్దు సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో శేషమ్మ కుటుంబీకులు ఎద్దు కోసం గాలించగా పొలంలో విద్యుత్ షాక్ తో మృతి చెంది కనిపించింది. ఎద్దు విలువ రూ. 60 వేలు ఉంటుందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్