ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చింతలమోరి వద్ద శుక్రవారం సాయంత్రం కారు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి లోయలో పడింది. నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఏటూరునాగారం నుండి వరంగల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాద ఘటన పై విచారణ జరుపుతున్నారు.