ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఏటూరునాగారం జడ్పీటీసీ, ములుగు జిల్లా తొలి జడ్పీ చైర్ పర్సన్ మలి దశ ఉద్యమ కారులు దివంగత నేత స్వర్గీయ కుసుమ. జగదీశ్వర్ (JD) 2వ వర్ధంతి వేడుకను మంగళవారం బీఆర్ఎస్ పార్టీ ఏటూరునాగారం మండల కమిటీ ఆధ్వర్యం లో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.