ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామంలో లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని గురువారం పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణనీటి సరఫరా శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పరిశీలించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ
తడిసిన ధాన్యాన్నీ కూడా ప్రభుత్వంమే కొనుగోలు చేస్తుందని అన్నారు.
ఆరుగాలం కష్టం చేసి రైతులు పండించిన వరి ధాన్యం అకాల వర్షాలకు తడిసిన ముద్ద కావడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు.