ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం భూపతిపురం, కామన్ పల్లి గ్రామాల్లోని వేటగాళ్ల వద్ద పట్టుకున్న అలుగు(ఇండియన్ పాంగోలిన్) ను అటవీశాఖ అధికారులు మంగళవారం తిరిగి అటవీ ప్రాంతంలో వదిలేశారు. మట్టి పుట్టలు అధికంగా ఉన్న అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు రేంజర్ అప్సరునీసా తెలిపారు. అలుగు జంతువులు అరుదుగా ఉంటాయని, వాటిని వేటాడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.