ఏటూరునాగారం: మావోయిస్టు మిలిషియ సభ్యులు, కొరియర్లను అరెస్ట్ చేసిన పోలీసులు

55చూసినవారు
ఏటూరునాగారం: మావోయిస్టు మిలిషియ సభ్యులు, కొరియర్లను అరెస్ట్ చేసిన పోలీసులు
ములుగు జిల్లాలో సీపీఐ మావోయిస్టు కార్యకలాపాల కట్టడిలో భాగంగా జిల్లా ఎస్పీ శబరీష్ ఆదేశాల ప్రకారం మంగళవారం సాయంత్రం వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు అనుమానాస్పదస్థితిలో కనిపించారు. వారిని పోలీసులు తనిఖీ చేయగా వారి వద్ద ప్రేలుడు సామాగ్రి ఉండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు ఏఎస్పీ బుధవారం తెలిపారు. పట్టుకున్న వారిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్