ములుగు జిల్లా మంగపేట మండలం ఓడగుడేంలో ఇసుక క్వారీ నిర్వహణకు శనివారం ప్రజాభిప్రాయ సేకరణను అధికారులు నిర్వహించారు. ఒడగుడేం 3వ క్వారీ నుండి 13. 50 హెక్టార్ల ఇసుక అనుమతుల కొరకు పర్యావరణ ప్రజాభిప్రాయ అనుమతులు సేకరించారు. గ్రామస్తులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినారు. ప్రజాభిప్రాయం మేరకే అనుమతులు ఉంటాయని అడిషనల్ కలెక్టర్ మహేందర్ జి. తెలిపారు.