అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుబెల్లి గ్రామంలో అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఊరవాగు ముంచేసింది. కొనుగోలు సెంటర్ల వద్ద సెంటర్ నిర్వాహకుల పర్యవేక్షణ లోపం, లోడింగ్‌కు సిద్దంగా ఉన్న బస్తాలు మిల్లర్లు లోడ్ చేసుకోకపోవడమే కారణమని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.