ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు మద్యం తాగి వీరంగం సృష్టించాడు మంగళవారం ఉదయం సెల్ ఫోన్ సిగ్నల్ కోసం పాఠశాల భవనం ఎక్కేందుకు వచ్చిన ఓ అయ్యప్ప స్వామిపై దురుసుగా ప్రవర్తించాడంతో సదరు స్వామి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మద్యం తాగి బూతులు తిడుతూ తనపై చేయి చేసుకున్నాడని వాపోయాడు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.