సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు సభ్యులు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ ఎదుట బుధవారం లొంగిపోయారు. ఏఎస్పీ శివమ్ ఉపాధ్యాయ తెలిపిన వివరాల ప్రకారం.. అడవి ప్రాంతాల్లో పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేయడం, ఎదురు కాల్పుల దృష్ట్యా ప్రాణభయంతో లొంగిపోయారన్నారు. జనజీవన స్రవంతిలో కలిసి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మావోయిస్టు అగ్రనేతలు సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు వారు తెలిపారని అన్నారు.