రైతు రుణమాఫీ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

82చూసినవారు
రైతు రుణమాఫీ సహాయ కేంద్రంలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. ములుగు వ్యవసాయ శాఖ కార్యాలయంలోని రైతు రుణమాఫీ సహాయ కేంద్రాన్ని బుధవారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతులకు 2వ విడత కింద రుణమాఫీ జరుగుతుందన్నారు. రుణమాఫీలో పేరు ఉన్న ప్రతి రైతు బ్యాంకుకు వెళ్లి రెన్యువల్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్