బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు సత్యాగ్రహ దీక్ష

85చూసినవారు
ములుగు జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం రైతు సత్యాగ్రహ దీక్ష కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఎలాంటి ఆంక్షలు లేని రూ. 2 లక్షల వ్యవసాయ రుణాన్ని బేషరతుగా మాఫీ చేయాలని, కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోకి కట్టుబడి రైతుభరోసా అందించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్