ములుగు జిల్లాలోని కొండపర్తి గ్రామం 5ఏళ్లు అభివృద్ధిలో ముందుకు వెళ్లిందని జిల్లా కలెక్టర్ దివాకర అన్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటనలో భాగంగా కొండపర్తి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ అడిగిన వెంటనే కొండపర్తి గ్రామాన్ని గవర్నర్ దత్తత తీసుకోవడం హర్షనీయమన్నారు. గ్రామంలో 265 జనాభా ఉందని, 70 ఇండ్లు ఉన్నాయన్నారు. గవర్నర్ గ్రామాభివృద్ధికి రూ. కోటి 45 లక్షలు కేటాయించారన్నారు.