నూగూరు వెంకటాపురంలో బంద్ కు సంపూర్ణ మద్దతు

67చూసినవారు
ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలో మావోయిస్టు బంద్ ప్రభావం సంపూర్ణంగా కనిపించింది. మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రధాన కూడళ్లు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు, చిరు వ్యాపారాలు సైతం స్వచ్ఛందంగా తమ షాపులను మూసివేసి బంద్ పాటించారు. వాజేడు, వెంకటాపురం మండలాలు అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో పూర్తిగా షాపులు మూసివేసి వ్యాపారస్తులు ఇళ్లకే పరిమితమయ్యారు.

సంబంధిత పోస్ట్