ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారికి ఇరువైపుల సైడ్ కాలువలు నిర్మించలేదు. వర్షాకాలం రోడ్లపై ఇరువైపుల వర్షపు నీరు నిలిచి ఉండడంతో క్రిమికీటకాలు, దోమలు చేరడం వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు జిపి అధికారులకు తెలిపారు. స్పందించిన గ్రామ పంచాయతీ సిబ్బంది గురువారం రోడ్లకు ఇరువైపుల ఉన్న బురదలో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు.