ములుగు జిల్లా ఏటూరునాగారంలో మండల వ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం వర్షం మొదలైంది. ములుగు జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలతో మిర్చి, వరి, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయం తెలిసిందే. మళ్లీ 2 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వాసులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని పలుప్రాంతాల్లో ధాన్యం కోసి కల్లాల్లో ఆరబెట్టగా, మరికొన్ని చోట్ల ఇంకా కోతలు మొదలుకాలేదు.