ములుగు జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి వరి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు మండలాల్లోని పలు చోట్ల నాట్లు వేసిన పొలాల్లో వరద కారణంగా నాటు కొట్టుకుపోయిందని గురువారం రైతులు వాపోయారు. పలువురు రైతులు పొలాల్లో వరద నీరు నిల్వ ఉండడంతో గట్లకు గండ్లు కొట్టి నీటిని బయటకు పంపుతున్నారు. ఇదిలా ఉండగా భారీ వర్షాలతో చెరువులు, కుంటలు మత్తడి దూకుతున్నాయి.