ములుగు మండలం ఇంచర్ల గ్రామానికి చెందిన ఓ ఛానల్ రిపోర్టర్ రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క బుధవారం రమేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రమేశ్ కుటుంబాన్ని పరామర్శించి రూ. 25వేల ఆర్థిక సాయం అందజేసి ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జర్నలిస్ట్ రమేశ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు.