కొత్తగూడ: కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం

58చూసినవారు
కొత్తగూడ: కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం
కాంగ్రెస్ పాలనలోనే మహిళా సంక్షేమం కొనసాగుతుందని కొత్తగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సారయ్య అన్నారు. ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ మండల కేంద్రంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతిని గురువారం నిర్వహించారు. బ్యాంకులను జాతీయం చేసిన ఘనత ఇందిరాగాంధీకే దక్కిందని, మహిళలకు రిజర్వేషన్లను కల్పించారన్నారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణలో మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్