ములుగుమావోయిస్టులు లొంగిపోయేలా కృషి చేయండి: ఎస్పీ శబరీష్

57చూసినవారు
మావోయిస్టు పార్టీలో పని చేస్తున్న అగ్ర నాయకులను లొంగిపోయేలా కుటుంబ సభ్యులు కృషి చేయాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గురువారం తెలిపారు. దశాబ్దాలుగా అడవి బాట పట్టిన తక్కళపల్లి వాసుదేవరావు, బడే చొక్కా రావు, కొయ్యడ సాంబయ్య, పులుసం పద్మ, ఈసం అర్జున్, సాధనపల్లి చందు కుటుంబసభ్యులను కలిసి ఎస్పీ విజ్ఞప్తి చేశారు. లొంగిపోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, మావోయిస్టులపై ఉన్న రివార్డు అందజేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్