కాటాపూర్ లో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

56చూసినవారు
కాటాపూర్ లో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉరి వేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ కు చెందిన కొంపెల్లి దేవేందర్ (36)మంగళవారం అర్ధరాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా దేవేందర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్