మంగపేట: వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

56చూసినవారు
మంగపేట: వైభవంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు
ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం 9 గంటలకు విష్వక్సేన పూజ, పుణ్య హవాచనం, రక్షాబంధనం కార్యక్రమాలను భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానం అర్చకులు మూరళీకృష్ణమాచార్యుల బృందం వేద మంత్రోచ్ఛరణలతో నిర్వహించారు. అనంతరం అంకురార్పణ చేపట్టారు. కాగా బ్రహ్మోత్సవాలు ఈనెల 17వరకు ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.

సంబంధిత పోస్ట్