ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారం రాత్రి నాగవెల్లి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని వీక్షించారు. ఆలయ ఈవో సత్యనారాయణ పర్యవేక్షణలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం అర్చకులు ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. కాగా రేపటితో ఉత్సవాలు ముగియనున్నాయి.