మేడారం: మొక్కలు నాటి.. మొక్కు తీర్చుకున్నారు!

66చూసినవారు
మేడారం: మొక్కలు నాటి.. మొక్కు తీర్చుకున్నారు!
మేడారంలో మొక్కలు నాటి ఓ కుటుంబసభ్యులు మొక్కు తీర్చుకున్నారు. రేంజర్ నరేందర్ తెలిపిన వివరాలు.. భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన దుర్గా కుటుంబసభ్యులు ములుగు జిల్లా మేడారం సమ్మక్క, సారలమ్మలకు మొక్కు కింద 116 మొక్కలు నాటుతామని మొక్కుకున్నారు. తాడ్వాయి-మేడారం మధ్య లక్షల చెట్లు కూలిపోయిన ప్రాంతంలో బుధవారం 116 మొక్కలు నాటి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారిని అటవీశాఖ అధికారులు అభినందించారు.

సంబంధిత పోస్ట్