
తల్లికి వందనం.. అర్హతలు ఇవే
AP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘తల్లికి వందనం’ పథకానికి కొన్ని అర్హతలు ఉండాలి. ముఖ్యంగా తల్లి ఏపీకి శాశ్వత నివాసి అయి ఉండాలి. కనీసం ఒక స్కూల్ వయస్సు పిల్లవాడు ఉండాలి. కుటుంబ ఆదాయం రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ పరిమితికి లోబడి ఉండాలి. తల్లి పేరు గృహ డేటాబేస్లో ఉండాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్గా ఉండి, E-KYC పూర్తయి, NPCIతో లింక్ అయి ఉండాలి. ఈ అర్హతలున్న ప్రతి తల్లి ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.