ములుగు జిల్లా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట మండలాల్లోని పలు గ్రామాల్లో మంగళవారం రహదారుల నిర్మాణాలకు మంత్రి సీతక్క శంకుస్థాపనలు చేశారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో 30 లక్షల నిధులతో నిర్మించిన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ క్వార్టర్ ను ప్రారంభించి మొక్కను నాటారు. ఈ కార్యాలయం ప్రారంభోత్సవంలో సిసిఎఫ్ ప్రభాకర్ రావు, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్ జీ, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.