వాయనాడ్ లో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి సీతక్క

78చూసినవారు
వాయనాడ్ లో జరిగిన ఘటనపై మంత్రి సీతక్క గురువారం విచారం వ్యక్తం చేశారు. కేరళ వరద బాధితులకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. ఆపదలో ఉన్నవారికి మానసిక ధైర్యాన్ని, మన వంతుగా ఆర్థిక సాయాన్ని అందించడం సామాజిక బాధ్యత అన్నారు. వరదల వల్ల కొండ చరియలు విరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోయారని, అత్యంత హృదయ విషాదకర ఘటనతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయని తెలిపారు. చేయి చేయి కలిపి కేరళ వరద బాధిత ప్రజలకు అండగా ఉందామన్నారు.

సంబంధిత పోస్ట్