జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహాత్మా గాంధీ సేవలను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీజీ అడుగుజాడల్లో నడిచి శాంతి, సమానత్వం, ఐక్యత కోసం కృషి చేసేందుకు మనందరం ప్రతిజ్ఞ చేద్దామని సీతక్క పిలుపునిచ్చారు.