కుసుమ జగదీశ్వర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పల్లా

82చూసినవారు
కుసుమ జగదీశ్వర్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పల్లా
ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో దివంగత ములుగు జడ్పీ ఛైర్మన్ కుసుమ జగదీశ్వర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం శనివారం నిర్వహించారు. జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగదీశ్వర్ వర్ధంతి కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగదీశ్వర్ చిత్రపటానికి పూలుచల్లి బాధా తప్త హృదయంతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్